నాటు నాటు వీడియో సాంగ్ కుమ్మేస్తుంది.. రికార్డ్‌ వ్యూస్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.వెయ్యి కోట్ల వసూళ్లను సునాయాసంగా రెండు వారాల్లోనే రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు మరో రెండు వందల కోట్ల వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

 Ram Charan Ntr Naatu Naatu Song Dance Video  ,ram Charan  , Ntr ,  Naatu Naatu S-TeluguStop.com

ఈ సినిమా వసూళ్ల విషయంలో రికార్డుల మ్రోత మ్రోగుతూనే ఉంది.పెద్ద ఎత్తున సినిమా లోని యాక్షన్‌ సన్నివేశాలకు జనాల నుండి మంచి ఆధరణ లభిస్తుంది.

ఈ సమయంలోనే నాటు నాటు పాట ను విడుదల చేశారు.

పాట యొక్క వీడియో విజువల్స్ కోసం మొత్తం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా వీడియో సాంగ్‌ కు అనూహ్యంగా మంచి స్పందన వచ్చింది.కేవలం రెండు గంటల్లోనే నాటు నాటు సాంగ్‌ వీడియో కు ఏకంగా మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Telugu Alia Bhatt, Naatu Naatu, Raja Mouli, Rajamouli, Ram Charan-Movie

గతంలో ఒక వీడియో సాంగ్‌ కు ఈ స్థాయి లో వ్యూస్ వచ్చిన దాఖలాలే లేవు.ఈ సినిమా లోని ఆ పాట చాలా స్పెషల్‌ గా నిలిచింది.పాటలో ఇద్దరు హీరోల డాన్స్ ను చూసేందుకు రెండు కళ్లు కూడా సరి పోవు.అందుకే అభిమానులు థియేటర్ లో చూసినా కూడా మళ్లీ యూట్యూబ్‌ లో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

అందుకే ఈ వీడియో సాంగ్‌ కు అత్యధికంగా వ్యూస్ వస్తాయని అంటున్నారు.లిరికల్‌ వీడియోకు కూడా మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా పాట మరింతగా దూసుకు పోతుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.

 రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల డాన్స్ ను అభిమానులు నోరు వెళ్ళబెట్టి చూసేలా  నాటు నాటు వీడియో సాంగ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే ఈ స్థాయి వ్యూస్ దక్కుతున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube