రామ్ చరణ్( Ram Charan ) హీరోగా శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం గేమ్ చేంజర్( game changer ).ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మందకోడిగా జరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో అయిదు లేదా పది రోజులు మాత్రమే షూటింగ్ జరుపుతూ ఉన్నారు.దిల్ రాజు( dil raju ) ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమా విషయంలో లైట్ తీసుకున్నారు అంటూ అనిపిస్తోంది.ఎందుకంటే సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగడంతో అసలు సినిమా సంక్రాంతికి రాదని తేలిపోయింది.
కనీసం వచ్చే ఏడాది లో అయినా సినిమా వస్తుందా అని అంతా అనుకుంటున్నారు.దర్శకుడు శంకర్( Director Shankar ) ఇండియన్ 2 సినిమాను చేయడం ద్వారా గేమ్ చేంజర్ సినిమాను లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.అందుకే రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ విషయంలో లైట్ గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.రామ్ చరణ్ ఇప్పటికే తన తదుపరి సినిమా ను బుచ్చి బాబు( Buchi Babu ) తో చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రమే బుచ్చి బాబుకు డేట్లు ఇవ్వాలని భావించాడు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేలా ఉంది.అందుకే బుచ్చి బాబు సినిమా ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 సమ్మర్ లో సినిమా ను ప్రారంభించాలని భావిస్తున్నారు.2025 సంక్రాంతికి సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్న బుచ్చి బాబు త్వరలోనే ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా కంటే కూడా ముందు బుచ్చి బాబు సినిమా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.