బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ రాఖీ సావంత్( Bigg Boss beauty Rakhi Sawant ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఖీ సావంత్, బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అలాగే ఈమె కాంట్రవర్సీల ద్వారా కూడా బాగా పాపులర్ అయింది అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది.తన మాజీభర్త ఆదిల్ ఖాన్ దురానీపై( Adil Khan Durrani ) సంచలన కామెంట్స్ చేసింది.
ఇరాన్‌కు చెందిన తన ప్రియురాలిని అత్యాచారం చేసినందుకే ఆదిల్ జైలు జీవితం గడిపాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా రాఖీ సావంత్ మాట్లాడుతూ.ఆదిల్ తన ఇరానీ గర్ల్‌ఫ్రెండ్‌ను లైంగికంగా, మానసికంగా వేధించాడు.నన్ను కూడా కొట్టి తీవ్రంగా హింసించాడు.ఆదిల్ ఖాన్ మహిళలతో పాటు పురుషులను కూడా లైంగికంగా వాడుకోవడం నేను చూశాను.దుబాయ్‌లో( Dubai ) నన్ను చంపడానికి ప్రయత్నించాడు.
దురానీ అత్యంత దుర్మార్గుడు.అతనిపై కేసు పెట్టేందుకు నేను ఎవరికీ రూ.3 లక్షలు ఇవ్వలేదు.తాను ఇరానీ గర్ల్ ఫ్రెండ్‌తో దాదాపు 5 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు.
ఆమెపై ఆరు నెలల పాటు అత్యాచారం చేశాడు.
నన్ను పెళ్లి చేసుకున్న విషయం కూడా ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.ఆమెకు, నాకు పచ్చి అబద్దాలు చెప్పి మోసం చేశాడు.ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు అంటూ ఎమోషనల్ అవుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా రాఖీసావంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా గతంలో కూడా చాలాసార్లు వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ ఏడాది అనగా మార్చి 2023లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.ఆ తర్వాత ఆదిల్ తనను మభ్యపెట్టి రూ.1.5 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది.అంతే కాకుండా అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.