తెలంగాణ గవర్నర్ తమిళిసైతో రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలో బీసీల సమస్యలను లక్ష్మణ్ గవర్నర్ కు వివరించారు.
తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తిరిగి చేర్చేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెంట ఏపీ బీజేపీ నేతలు కూడా ఉన్నారు.