Rajinikanth Movies: తెలుగులో రజినీకాంత్ టాప్ షేర్ మూవీస్ ఇవే.. టాప్ వన్ లో ఆ సినిమా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన రజనీకాంత్ ఆ తర్వాత కాలంలో కాస్త జోరుని తగ్గించేసారని చెప్పవచ్చు.

 Rajinikanth Top Share Movies In Telugu From Jailer Robo To Sivaji Here Are The-TeluguStop.com

ఒకప్పుడు ఈయన సినిమాలు వస్తున్నాయంటే తెలుగు స్టార్ హీరోలు భయపడే పరిస్థతి.రాను రాను వరుస ఫ్లాపులతో రజినీకాంత్ తెలుగు మార్కెట్ పడిపోతూ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈయన జైలర్ మూవీతో( Jailer Movie ) హిట్ టాక్‌తో బ్యాక్ బౌన్స్ అయ్యారు.అయితే మరి తెలుగులో రజినీకాంత్ నటించిన టాప్ షేర్ మూవీస్ ఏవి అన్న విషయానికి వస్తే.

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్‌ హీరోలుగా తెరకెక్కని మూవీ 2.O( Robo 2.O )

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని రాబట్టింది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 12.5 కోట్ల షేర్ రాబట్టింది.ఈ మధ్య కాలంలో రజినీకాంత్ మూవీకి మొదటి రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొదటి రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 704 కోట్ల సాధించి కలెక్షన్ల సునామీని సృష్టించింది.తాజాగా రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.హిట్ అనిపించుకోవాలంటే రూ.13 కోట్లు రాబట్టాలి.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని తెలుగులో ఈ సినిమా రూ.37.09 కోట్ల షేర్ వసూళ్లను 10 రోజుల్లో రాబట్టింది.

Telugu Jailer, Kabali, Lingaa, Rajinikanth, Rajinikanthtop, Robo, Sivaji, Tollyw

ఫైనల్ రన్‌లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాిలి.ఈ సినిమా తెలుగులో రూ.24.09 కోట్ల లాభాలను ఆర్జించింది.ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.474 కోట్ల గ్రాస్ రాబట్టింది.కాగా శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ రోబో.( Robo ) ఈ చిత్రం తెలుగులో రూ.36 కోట్ల షేర్ రాబట్టి మూడో ప్లేస్‌లో నిలిచింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే రూ.288 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.పా రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ కబాలి.( Kabali ) ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Telugu Jailer, Kabali, Lingaa, Rajinikanth, Rajinikanthtop, Robo, Sivaji, Tollyw

సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.87.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.మొత్తంగా ఈ సినిమా 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ శివాజి.

( Shivaji Movie ) వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.18.05 కోట్ల షేర్ రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.అలాగే రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ లింగ.( Linga Movie ) ఈ సినిమా తెలుగులో అప్పట్లోనే రూ.16.33 కోట్ల షేర్ రాబట్టింది.ఓవరాల్‌గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube