మరోసారి రిపీట్ కాబోతున్న రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన మహేష్ బాబుతో( Mahesh Babu ) సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

 Rajamouli Ntr Combination , Ss Rajamouli, ,mahesh Babu, Ntr, Rrr Movie, Ram Ch-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ సినిమా ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతోంది.

అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి మరోసారి ఎన్టీఆర్ ( NTR ) తో సినిమా చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

Telugu Devara, Koratala Shiva, Mahesh Babu, Prashanth Neel, Rrr, Ss Rajamouli, T

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie) చేసే సమయంలోనే తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని తెలియజేశారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సమయంలోనే తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఖాతాలో మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కాయమని తెలుస్తుంది.

ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే.

Telugu Devara, Koratala Shiva, Mahesh Babu, Prashanth Neel, Rrr, Ss Rajamouli, T

ఇలా రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రావడమే కాకుండా వీరిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని రాజమౌళి పలు సందర్భాలలో తెలియజేశారు.ఇక ఈ విషయం తెలిసే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ కాంబినేషన్లో సినిమా రావడానికి మరో మూడు సంవత్సరాలు సమయం కచ్చితంగా పడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈయన కొరటాల శివ( Koratala Shiva ) దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.అలాగే హిందీ వార్ 2 (War 2)లో కూడా ఈయన నటించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube