ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయాఫ్రం వాల్ రిపేరు గాని ఎర్త్ కం రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణాలు ఇక ప్రశ్నార్థకమేనా.రెండు నిర్మాణాల కి అడ్డంకి ఆ ప్రాంతంలోకి బారిగా చేరుతున్న నీరు.
ఎగువ కాపర్ డ్యాం లో తొమ్మిది ప్రదేశాల నుండి భారీగా నీరు లీకేజీలు. ఎగువ దిగువ కాపర్ డ్యాం ల మధ్య భారీగా చేరుకుంటున్న లీకేజిల నీరు.
గత సంవత్సరం దిగువ కాఫర్ డ్యామ్ నిర్మించని కారణంగా ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం నిర్మించే ప్రదేశంలోకి చేరిన నీరు.అలా చేరిన నీరు తోనే దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్.
ప్రస్తుతం వస్తున్న వరద నీటికి ఎగువ కాఫర్ డ్యాం నుండి లీకేజ్ అవుతున్న నీరు.
ఏగువ, దిగువ కాఫర్ డ్యాం ల మధ్య చేరుకుంటున్న నీటిని సుమారు 40 మోటార్లతో బయటికి తోడే ప్రయత్నం చేస్తున్న నిర్మాణ సంస్థ.
ఉన్న నీరు పూర్తిగా తొలగించక ముందే ఏగువ కాపర్ డ్యామ్ మరికొన్న చోట్ల నుండి లీకేజ్ అవుతున్న నీరు.మోటర్లను కూడా నిలిపివేసిన సిబ్బంది.ఇక డయాప్రం వాల్ నిర్మాణం పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు.ఎగువ కాఫర్ డ్యాం మూడేళ్ళే పనిచేస్తుందంటూ ఇప్పటికే పేర్కొన్న మంత్రి అంబటి రాంబాబు.