గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ లు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి .ముఖ్యంగా రాజకీయం గా తమ అనుకూల వర్గాలకు ఒకలాగా వ్యతిరేక వర్గాలకు మరొక లాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అన్న విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి .
ముఖ్యంగా సినిమా రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్( Pawan kalyan ) రాజకీయాల్లో సరికొత్త శక్తిగా ఎదుగుతున్నందున, ఆయనకు సంబంధించిన సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్లో కొంత ఉత్కంఠ పరిస్థితి ఎదురవుతుంది.ముఖ్యంగా ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే టిక్కెట్లు రేట్లు భారీగా తగ్గించడం, ఆ తర్వాత యధాతత స్థితికి తీసుకురావడం వంటి విషయాలు ఉద్దేశపూర్వకంగా పవన్ పట్ల అధికార పార్టీ వేధింపులకు పాల్పడుతుందన్న విశ్లేషణలు మీడియాలో కనిపించేవి.

పవన్ గత సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్( Bheemla nayak ) వంటి సినిమాల రిలీజ్ సమయంలో ఎమ్మార్వో లాంటి ఆఫీసర్లను కూడా సినిమా హాల్లో దగ్గర నిఘా పెట్టిన పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కనిపించింది దాంతో అధికార పార్టీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందంటూ జనసేన కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున ఆందోళన చేసేవారు.ఇప్పుడు తన వారహయాత్ర( Vrahi yatra ) తో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ వేడిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాను ఈనెల 28వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు.దాంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అన్న ఆందోళనలో పవన్ అభిమానులు ఉన్నట్లుగా తెలుస్తుంది .

తమ ప్రభుత్వంపై విపరీతమైన విమర్శలు చేస్తూ తమను రాజకీయం గా ఇరుకున పేడుతున్న పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టే అవకాశాన్ని అధికార పార్టీ వదులుకోదని కచ్చితం గా ఇబ్బందులకు గురి చేస్తుందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ఈ సినిమా విషయంలో ఇబ్బంది పెడితే అది పవన్ కు సానుభూతిగా మారుతుంది అన్న అంచనాలు కూడా అధికార పార్టీలో ఉన్నాయని అందువల్ల చూసి చూడనట్టుగా అధికార పార్టీ ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారుమరి ఏ విషయం రెండు రోజుల్లో తేలిపోతుంది.







