ఎన్ఆర్ఐల ఫిర్యాదులకు కొత్త వెబ్‌సైట్ .. ఇకపై వేగంగా పరిష్కారం : పంజాబ్ సీఎం భగవంత్ మాన్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం లక్షలాది మంది భారతీయులు వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడే కుటుంబంతో సహా స్థిరపడుతున్నారు.

 Punjab Cm Bhagwant Mann Launches Website For Speedy Grievance Redressal Of Nris-TeluguStop.com

మనదేశంలో పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలను( NRIs ) కలిగివున్న రాష్ట్రాల్లో పంజాబ్( Punjab ) కూడా ఒకటి.స్వాతంత్య్రానికి పూర్వమే పంజాబీలు కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో స్థిరపడ్డారు.

ఇక గల్ఫ్‌ దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో పంజాబీ ప్రవాసులు వున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాయపడుతున్నారు.

అయితే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండటంతో స్వరాష్ట్రంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పంజాబ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్ఆర్ఐల ప్రయోజనాల విషయంలో పెద్ద పీట వేస్తుంది.

తాజాగా సీఎం భగవంత్ మాన్( CM Bhagwant Mann ) నేతృత్వంలోని సర్కార్ కూడా ఇదే దిశగా ముందుకు వెళ్తోంది.ఈ నేపథ్యంలో భగవంత్ మాన్ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం తీసుకొచ్చిన కొత్త వెబ్‌సైట్ ‘‘ nri.punjab.gov.in ’’ను ప్రారంభించారు.

Telugu Bhagwant Mann, Kuldeepsingh, Nri Milnis, Nri Website, Nris, Punjabcm, Pun

ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ సమావేశానికి అధ్యక్షత వహించిన భగవంత్ మాన్.ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్ఐ మిల్నిస్‌లతో( NRI Milnis ) ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న ఫిర్యాదులు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.రాష్ట్రంలో ఎన్నడూ చూడని ప్రాంతాలు , ప్రదేశాలను ఎన్ఆర్ఐలకు చూపాలని ఆయన సూచించారు.పంజాబీలను ఆదుకునేందుకు గాను త్వరలో ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో( IGI Airport Delhi ) సహాయ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Telugu Bhagwant Mann, Kuldeepsingh, Nri Milnis, Nri Website, Nris, Punjabcm, Pun

కాగా.ఎన్ఆర్ఐ కమీషన్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) శ్రద్ధ చూపడం లేదని ప్రతిపక్షనేత పర్తాప్ సింగ్ బజ్వా( Partap Singh Bajwa ) ఇటీవల మండిపడ్డారు.ఇది కమీషన్ పనితీరును నిర్వీర్యం చేయడమే కాకుండా ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని బజ్వా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం భగవంత్ మాన్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌లకు పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఆయన దుయ్యబట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube