ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను కలెక్టర్ వి పి గౌతమ్ స్వీకరించారు.స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ఫార్వార్డ్ చేశారు.ఈ సందర్భంగా బాలాజీ నగర్, ఖానాపూర్ హావేలి, ఖమ్మం నుండి నూతలపాటి సంజీవరావు, ఇంటి నెం.1-548, 1-549 ల ఆన్లైన్ రికార్డు వివరాలు ఇప్పించుటకు కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వేంసూరు మండలం అమ్మపాలెం నుండి బ్రహ్మయ్య, సాయిబాబు లు తమకు ఇవ్వబడిన ఆసైన్మెంట్ పట్టాభూములను ఇతరులు ఆక్రమించారని, వారినుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తిరిగి తమకు ఇవ్వవలసినదిగా కోరగా, పరిశీలనకై తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.సత్తుపల్లి మండలం కృష్టాపురం నుండి బి.వెంకటేశ్వర రావు, తాను వికలాంగుడనని, ఆసరా పెన్షన్ మంజూరుకు కోరగా, డిఆర్డీవో ను చర్యలకై కలెక్టర్ ఆదేఅధికారులు తల్లాడ మండలం మల్లవరం గ్రామ ప్రజలు, రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ నందు గ్రామ కంఠం కు సంబంధించిన స్థలం ఆక్రమణ విషయమై చర్యలకు కోరగా, జిల్లా పంచాయతీ అధికారిని తనిఖీ చేసి, చర్యలు చేపట్టవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు.
మధిర మండలం ఖాజీపురం నుండి దాసోహం మల్లికార్జున రావు, తాను వికలాంగుడినని, మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు, అవసరం వున్నప్పుడు పని ఇవ్వడం, లేనప్పుడు తీసివేయడం చేస్తున్నట్లు, కళాశాలలో రెగ్యులర్ వాచ్ మెన్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు, అట్టి పోస్టులో నియమించగలందులకు కోరగా, జిల్లా ఉపాధికల్పనాధికారిని చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.
చింతకాని మండలం రెపల్లెవాడ నుండి పగిడిపల్లి కిషోర్ బాబు, పగిడిపల్లి శ్రీకాంత్ లు దళితబంధు లబ్ది కొరకు కోరగా, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారిని పరిశీలించి, చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.బోనకల్ మండలం మోటమర్రి గ్రామం నుండి నండ్రు పురుషోత్తం తన ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ లేదని నీరు రావడం లేదని చర్యలకై కోరగా, ఇఇ మిషన్ భగీరథ కు వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.
తిరుమలాయపాలెం నుండి ఆలేటి చంద్రకళ, తన భర్త చనిపోయినట్లు, వితంతు పెన్షను మంజూరుకు కోరగా, డిఆర్డీవో కు చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామం నుండి తిప్పిరెడ్డి నిర్మల, తనకు సర్వే నెం.21/ఆ/3/ఆ లో 28 న్నర గుంటల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని, కావున తొలగించిగలందులకు కోరగా, ధరణి ఓఎస్డీ ని పరిశీలించి చర్యలకై కలెక్టర్ ఆదేశించారు.ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల రెవిన్యూ గ్రామ పరిధిలోని చిన్న వెంకటగిరి నుండి వి.ధనమ్మ సర్వే నెం.272 లో గల ఇంటిని ప్రభుత్వ ఉత్తర్వు 59 ప్రకారం క్రమబద్దీకరణకు కోరగా, ఆర్డీవో ను పరిశీలించి, చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.