ప్రత్యూష మొదటి, చివరి రెమ్యునరేషన్లు ఇవే.. వాటికే ఓకే చెప్పిందంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ప్రత్యూష తక్కువ సినిమాలలోనే నటించినా ప్రేక్షకుల మనస్సులో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.ప్రత్యూష తల్లి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాయుడు సినిమా తర్వాత ప్రత్యూషకు ఎక్కువగా సిస్టర్ రోల్స్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు.

 Pratyusha First And Last Remunerations Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

అయితే హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని ప్రత్యూష చెప్పిందని ఆమె అన్నారు.

కృష్ణవంశీ సముద్రంలో మంచి పాత్ర అని చెప్పి ప్రత్యూష ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పించారని ఆమె కామెంట్లు చేశారు.

వాసు డైరెక్షన్ లో ప్రత్యూష హీరోయిన్ గా ఒక సినిమాకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని ఆమె వెల్లడించారు.సినిమాల ఎంపికలో ఇద్దరి నిర్ణయాలు ఉండేవని ఆమె పేర్కొన్నారు.

డబ్బు కంటే పాత్రలకే ప్రత్యూష ఇచ్చిందని ఆమె వెల్లడించారు.
   

Telugu Mohan Babu, Prathyusha, Rayudu, Sri Ramuulayya-Movie

సౌందర్య, ఊహ, శ్రీదేవిలా ఎదగాలని ప్రత్యూష భావించేదని ప్రత్యూష తల్లి అన్నారు.స్నేహమంటే ఇదేరా సమయంలో ప్రత్యూషకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని నాగ్ మాట ఇచ్చారని ప్రత్యూష తల్లి పేర్కొన్నారు.ప్రత్యూష స్టార్టింగ్ రెమ్యునరేషన్ 35,000 రూపాయలు అని చివరి రెమ్యునరేషన్ 5 లక్షల రూపాయలు అని ప్రత్యూష తల్లి పేర్కొన్నారు.

రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదని ప్రత్యూష తల్లి చెప్పుకొచ్చారు.

ప్రత్యూష తల్లి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రత్యూషని సౌందర్య చాలా ప్రోత్సహించిందని ప్రత్యూష తల్లి తెలిపారు.రాకేశ్ మాస్టర్ దగ్గర ప్రత్యూష డ్యాన్స్ నేర్చుకుందని ప్రత్యూష తల్లి వెల్లడించారు.

రాయుడు సినిమాకు ప్రత్యూషకు 70,000 రూపాయల రెమ్యునరేషన్ దక్కిందని ప్రత్యూష తల్లి అన్నారు.రాయుడు సినిమాలో నటించే సమయంలో ప్రత్యూష వయస్సు 15 సంవత్సరాలు అని ప్రత్యూష తల్లి అన్నారు.

శ్రీ రాములయ్య మూవీ మొదట విడుదలైందని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube