సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్న ప్రభాస్... ఎన్ని మిస్ అయ్యాయంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా కొన్ని కారణాలవల్ల మరో హీరో దగ్గరకి వెళ్తుంది.ఈ క్రమంలోనే ఆ సినిమా ఇతరులు చేసి మంచి విజయాన్ని అందుకున్న తర్వాత చాలా మంది హీరోలు ఎంతో పశ్చాత్తాప పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 Prabhas Was Missed Super Hit Movies Do You Know How Many Missed , Prabhas , Toll-TeluguStop.com

ఈ విధంగా కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.అలాగే మరికొన్ని సినిమాలు చేయకపోవడమే మంచిది అయ్యింది అనుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

ఇలా ప్రతి ఒక్క హీరో కొన్ని కారణాల వల్ల ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు.ఇలాంటి కోవలోనే హీరో ప్రభాస్ కూడా ఉన్నారు.

ఈయన కూడా తన కెరీర్ లో కొన్ని సినిమాలను కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశారు.మరి ఆ సినిమాలు ఏమిటో ఓసారి లుక్కేద్దాం.

ఒక్కడు: గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు భూమిక జంటగా తెరకెక్కిన చిత్రం ఒక్కడు.ఈ సినిమా ముందుగా ప్రభాస్ తో చేయాలనుకున్నారు.

అయితే కథ విన్న కృష్ణంరాజు కాస్త రిస్క్ గా ఉందని చెప్పడంతో ఈ సినిమా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది.

దిల్: నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.అయితే ఈ సినిమా ముందు ప్రభాస్ దగ్గరికి వెళ్లగా ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని వదులుకున్నారు.

సింహాద్రి: ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ దగ్గర కన్నా ముందుగా ప్రభాస్ దగ్గరికి వెళ్ళిందని తెలుస్తోంది.అయితే ఇలాంటి యాక్షన్ చిత్రాన్ని ప్రభాస్ హ్యాండిల్ చేయగలడా అన్న కారణంతో సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

ఆర్య: ఈ సినిమా కథ ముందుగా సుకుమార్ ప్రభాస్ కి వినిపించగా ఇలాంటి స్టోరీ తనకు సెట్ అవ్వదని ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది.

బృందావనం: వంశీ పైడిపల్లి మున్నా వంటి డిజాస్టర్ మూవీ తెరకెక్కించిన తర్వాత బృందావనం కథతో ప్రభాస్ దగ్గరికి వెళ్ళారు.అయితే ఆ సమయంలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది.

నాయక్: రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమా ముందుగా ప్రభాస్ చేయాల్సి ఉండగా మిర్చి సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని వదులుకున్నారు.

కిక్: రవితేజ కెరీర్ ని మార్చేసిన ఈ సినిమా ముందుగా ప్రభాస్ చేయాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ కాదనడంతో రవితేజ దగ్గరికి వెళ్ళింది.ఇవేకాకుండా ఎన్టీఆర్ ఊసరవెల్లి రవితేజ డాన్ శీను, గోపీచంద్ జిల్ వంటి చిత్రాలలో కూడా ప్రభాస్ నటించాల్సి ఉండగా సినిమాలలో నటించ లేకపోయారు.

Prabhas Was Missed Super Hit Movies Do You Know How Many Missed , Prabhas , Tollywood , Hero , Missed , Super Hit Movie , Film Industry , Film Industry - Telugu Prabhas, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube