రెండేళ్ల తర్వాత... దేశ చరిత్రలో మన సినిమాకే ఆ ఘనత

కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి.

 Prabhas Radheshyam Movie Releasing Update , Movie News , Pooja Hegde , Prabhas-TeluguStop.com

ఇండియాలో కూడా గత రెండు సంవత్సరాలుగా పెద్ద సినిమాలు విడుదల కాకుండా పోయాయి.ఇండియా లో కరోనా అడుగు పెట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు ఎట్టకేలకు అతి భారీ సినిమా రాధే శ్యామ్‌ రాబోతుంది.మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.మధ్య మధ్యలో చాలానే సినిమాలు వచ్చాయి.కాని అవేవి పెద్దగా ఆడలేదు.ఆడినా ఒక మోస్తరు వసూళ్లను దక్కించుకున్నాయి అనడంలో సందేహం లేదు.

Telugu Big, Box, Corona, India, Pooja Hegde, Prabhas, Radhakrishna, Radheshyam-M

ఎట్టకేలకు ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ప్రభాస్ పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ మరి ఇతర ఇండియన్ భాషల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

కనుక ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం.రెండేళ్ల తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు సినిమా రాబోతున్న నేపథ్యంలో సినీ ప్రేమికులు ఆనందంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

 రాధేశ్యాం సినిమాను దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్తో రూపొందించిన సమాచారం అందుతోంది.ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి ప్రభాస్ మరింత పెంచేలా ఈ సినిమా ఉంటుందని నా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube