సరిగ్గా 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని ప్రకటించడం తెలిసిందే.దీంతో పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్న క్రమంలో… ఈనెల 14వ తారీకు భారీ ఎత్తున జన సేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పార్టీ రెడీ అయింది.
ఈ తరుణంలో మంగళగిరి మండల పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించగా… తొలుత యజమానులు పోగా ఆ తర్వాత… తమ భూములను ఇవ్వలేమని చెప్పారు అంటూ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తెలియజేయడం జరిగింది.
ఒక్క సారిగా భూ యజమానులు మాట మార్చడం వెనకాల.
ఎవరున్నారో తమకు అన్నీ తెలుసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సభా వేదిక.
వారం రోజుల్లో నాలుగు చోట్ల మారిందంటే ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి తీసుకు వస్తుందో అర్థం చేసుకోవచ్చని సీరియస్ అయ్యారు.రాష్ట్రంలో అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతుందని.
కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నష్టపోయినా గానీ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
జగన్ పాలన పై ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రజలు 151 సీట్లు అందిస్తే అహంకారంతో పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల హైకోర్టు అమరావతి పై ఇచ్చిన తీర్పును జనసేన పార్టీ స్వాగతిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.