బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకుని క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.అయితే ఇప్పుడు మరొక ప్రాజెక్ట్ గురించి నేషనల్ వైడ్ టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం #Prabhas24 సినిమా గురించే అందరు చర్చించుకుంటున్నారు.
ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో పుకార్లు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఆల్ మోస్ట్ ఓకే అయిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతుంది.అందుకు కారణం కూడా లేకపోలేదు.సిద్దార్థ్ ఆనంద్ ఈ మధ్యే ప్రభాస్ ను కలిసి స్టోరీ చెప్పాడని సమాచారం.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారని తెలుస్తుంది.
ఆదిపురుష్ షూటింగ్ కోసం ప్రభాస్ ముంబై వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్ కి వెళ్లి సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ కు స్టోరీ చెప్పడంతో ప్రభాస్ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా అనౌన్స్ కూడా వస్తుందని సమాచారం.
అయితే ఇప్పుడు #Prabhas24 ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే కమిట్ అయ్యిన ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.దీంతో పాటు నాగ్ అశ్విన్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
అటు సిద్దార్థ్ ఆనంద్ కూడా షారుక్ ఖాన్ తో పఠాన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
ఈ కమిట్మెంట్స్ అయినా తర్వాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది.