టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా అమితమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు అనే సంగతి తెలిసిందే.వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సంపాదించిన మొత్తం లెక్కలు వేస్తే ఆయనకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి.
అయితే పవన్ మాత్రం తను సంపాదించిన డబ్బులో సగం కంటే ఎక్కువ మొత్తం సేవా కార్యక్రమాల కోసం, దాన ధర్మాల కోసం ఖర్చు చేస్తున్నారు.
అయితే పవన్ అభిమానులు తాజాగా పవన్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్యాక్స్ కట్టడానికి పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయలు అప్పు చేశారని వైరల్ అవుతున్న వీడియో ద్వారా స్పష్టత వచ్చింది.ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు షాకవుతున్నారు.
పవన్ కళ్యాణ్ నిజంగా దేవుడేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని మరి కొందరు చెబుతున్నారు.పవన్ పై విమర్శలు చేసేవాళ్లు పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులను కూడా గుర్తుంచుకోవాలని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ స్పందించడానికి కూడా ఇష్టపడటం లేదు.
మరోవైపు పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూనే సుజీత్ డైరెక్షన్ ఒక సినిమాలో హరీశ్ శంకర్ డైరెక్షన్ లో తేరి రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గురించి ఫ్యాన్స్ సంతోషిస్తున్న సంగతి తెలిసిందే.పవన్ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్ లను కూడా ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.