అసలు పూజ హెగ్డే( Pooja hegde ) కి ఏమైంది.ఎందుకు సినిమాలకి సైన్ చేసి కొద్ది రోజులకే ఆ ప్రాజెక్టుల నుండి తప్పుకుంటుంది అంటూ పూజ హెగ్డే అభిమానులు ఆందోళన పడుతున్నారు.
మరి పూజ హెగ్డే గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.ఆ సినిమాల వల్ల పూజ హెగ్డే కి ప్రాణహాని ఉందని, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
మరి ఇంతకీ పూజ హెగ్డే కి ప్రాణాన్ని ఉండడం ఏంటి అని మీరందరూ భావిస్తున్నారా.అయితే పదండి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది పూజ హెగ్డే.ఈ సినిమా ప్లాఫ్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ముకుంద సినిమా కూడా పూజ హెగ్డే కి ఏ మాత్రం పేరు తెచ్చి పెట్టలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహెంజో దారో సినిమాలో నటించి అతిపెద్ద డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.అలాంటి పూజ హెగ్డే ఎప్పుడైతే అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో చేసిందో ఆ ఒక్క సినిమాతో ఈమె రేంజ్ పెరిగిపోయింది అని చెప్పవచ్చు.
ఆ తర్వాత పూజ హెగ్డే అలవైకుంఠపురంలో ( Ala Vaikunthapurramuloo ) , మహర్షి, అరవిందసమేత వీర రాఘవ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ సినిమాల్లో నటించింది.ఇక ఈ సినిమాలతో పూజ హెగ్డే టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.కానీ ఏం లాభం ఆ తర్వాత వచ్చిన మూడు నాలుగు సినిమాలు వరుసగా డిజాస్టర్ అవ్వడంతో ఈ హీరోయిన్ రేంజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది.అయితే ఈ మధ్యకాలంలో ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం ( Guntur Kaaram ) వంటి సినిమాల్లో పూజ హెగ్డే కి హీరొయిన్ గా అవకాశం వచ్చింది.
కానీ ఈ రెండు సినిమాలకి సైన్ చేసిన పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో అందులో నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.అంతేకాదు పూజ హెగ్డే టీమ్ క్లారిటీ కూడా ఇచ్చింది.అయితే పూజ హెగ్డే( Pooja hegde ) ఈ సినిమాల నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఆమె ఆరోగ్యం బాగా లేదట.అవును గత సినిమాల్లో నటించిన టైంలో డాన్స్ చేసినప్పుడు తన కాళ్ళకి చాలా గాయాలయ్యాయట.
దాంతో కొద్ది రోజులుగా పూజ హెగ్డే ఆ గాయాలతో బాధపడుతుందట.అంతేకాదు తన కాళ్ళకి మేజర్ సర్జరీ కూడా చేయించుకుందట.ఇక ఈ కారణంతోనే పూజ హెగ్డే కొత్త సినిమాలకి ఒప్పుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు తాను పూర్తి ఆరోగ్యవంతంగా మారాకే మరిన్ని సినిమాలకు సైన్ చేస్తుందని ఇండస్ట్రీలో ఉండే పూజ హెగ్డే సన్నిహితులు చెబుతున్నారు.
అందుకే పూజ హెగ్డే వరుసగా సినిమాల నుండి తప్పుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.