తన మూడో విడత వరహా యాత్రకు ఉత్తరాంధ్రను ఎంచుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన వ్యాఖ్యల ద్వారా విశాఖ తీరంలో పొలిటికల్ తుఫాన్ సృష్టిస్తున్నారు.ముఖ్యంగా అధికార వైసిపి నేతలు నిబంధనలను తుంగలోకి తోక్కి ఇస్టారీతిన కట్టడాలు నిర్మించుకుంటూ దీన్ని ఒక నియంత సామ్రాజ్యంలా మార్చేస్తున్నారని తెలంగాణలో( Telangana ) ఈ తరహా అక్రమాలు చేస్తేనే అక్కడ నుంచి తన్ని తరిమేశారని ఇప్పుడు విశాఖను నాశనం చేయాలని చూస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
తీవ్ర ఉద్రిక్తతల నడుమ రుషికొండ( Rushikonda ) పర్యటనకు వెళ్ళిన పవన్ ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసిన వైనాన్ని మీడియా సమావేశంలో నిలదీశారు.చిన్నచిన్న ఉల్లంఘనలు జరిగాయని కోర్టులో ఒప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఇక్కడ భారీ స్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడుతుందని ప్రశాంతమైన విశాఖపట్నంలో శాంతిభద్రతలను గాల్లో దీపంలా చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు .
తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కూడా ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడుతున్న ఎంపీ వ్యవహారం సిగ్గుచేటు అని ఆయన పేర్కొన్నారు .ఇకపై జరగబోయే తన వారాహి తదుపరి సమావేశాలలో కూడా భారీ స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు దృష్టి పెట్టాలని భావించిన జనసేనాని ముఖ్యంగా ఏజెన్సీలో జరుగుతున్న గంజాయి సాగు పై మరియు అదికార నేతలపై వస్తున్న భూకబ్జా ఆరోపణల పై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని తెలుస్తుంది.అంతేకాకుండా మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న విధానాన్ని తన వారాహి యాత్ర( Varahi Yatra ) ద్వారా నిలదీస్తారని తెలుస్తుంది.ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై విమర్శనాత్మకం గా ఒక గేయాన్ని కూడా జనసేన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ముందు నుంచి ముద్దు లొద్దురో – వెనకనుంచి గుద్దులొద్దురో అంటూ డైరెక్ట్ గా వైసిపి అధినేత జగన్ ని ఉద్దేశించినట్టుగా రాసిన ఈ పాట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది .ఉభయ గోదావరి జిల్లాల యాత్ర తో పొలిటికల్ రేసులో ముందుకొచ్చిన జనసేన తన ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా పూర్తిస్థాయి పొలిటికల్ ఇమేజ్ను సాధించడానికి శరవేగం గా కదులుతున్నట్టుగా కనిపిస్తుంది.