జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు విశాఖ ఎంపీ ఎంవీవీ కౌంటర్ ఇచ్చారు.పవన్ కంటే కేఏ పాల్ వంద రెట్లు నయమని విమర్శించారు.
తాను స్వశక్తితో ఎదిగిన వ్యక్తినన్న ఆయన తన గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు లేదని చెప్పారు.
సీఎం జగన్ గొప్ప వ్యక్తి అన్న ఎంపీ ఎంవీవీ ఆయన కాలిగోటికి కూడా జనసేనాని పనికి రాడని విమర్శలు గుప్పించారు.
పవన్ కు రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణం ఒకటి కూడా లేదని చెప్పారు.పవన్ కు దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు.2024 ఎన్నికల తరువాత మాట్లాడాలని సూచించారు.