ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా దుమారం రేగుతున్న అంశం ఏదైనా ఉందా అంటే అది గంజాయి అనే చెప్పాలి.అటు ఏపీ ఇటు తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా ఓ రేంజ్ లోనే సాగుతోంది.
నిత్యం పోలీసులు పెద్ద ఎత్తున పట్టుకుంటున్నా కూడా ఇంకా ఆగట్లేదు.పోలీసులకు అందకుండా అక్రమార్కులు కొత్త ఎత్తుగడలతో గంజాయిని తరలిస్తున్నారు.
నిజానికి గంజాయిని అడ్డుకోవడంలో పోలీసులది కీలక పాత్ర అనే చెప్పాలి.వారు అలర్ట్ గా ఉంటేనే దీన్ని అడ్డుకోవడం సాధ్యం అవుతుంది.
కానీ ఈ నడుమ మాత్రం గంజాయి సరఫరా వెనక పోలీసులు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఆరోపణలుకు బలం చేకూరుస్తూ ఇప్పుడు ఓ సంచలన ఘటన జరిగింది.
కొత్తగూడెం జిల్లాలో ఈ నడుమ వరుసగా గంజాయి పట్టు బడుతున్న విషయం తెలిసిందే.అయితే ఈ సారి అందుకు భిన్నంగా ఏకంగా పోలీసులే గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టబడ్డారు.
కొందరు కానిస్టేబుళ్లు తమ దగ్గర గంజాయిని ఉండగా ఉన్నతాధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం సంచలనం రేపుతోంది.పోలీసులు అంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే ఇలా ఆ శాఖకు మచ్చ తెస్తున్నారని పలువురు పోలీసులు మండిపడుతున్నారు.
రాంబాబు అనే నిందితుడిని గంజాయి అమ్ముతుండగా పట్టుకోగా.అతను చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్ అయిపోయారు.అతను చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 5కిలోల గంజాయితో ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి సతీష్ ను వారు అదుపులోకి తీసుకున్నారు.అతనితో పాటు మరో చోట వెంకట్ అనే కానిస్టేబుల్ ను కూడా పట్టుకున్నారు.
వీరిద్దరూ ఎప్పటి నుంచో ఒరిస్సా మీదుగా ఇలా గంజాయి రవాణా సాగిస్తున్నారని తేలింది.గంజాయి స్మగ్లర్లో వీరికి బాగా పరిచయాలు ఉన్నాయని అందుకే ఇలాంటి పనిచేస్తున్నారని తెలిపారు.
.