నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటిటి లో అడుగు పెట్టనున్న విషయం విదితమే.తెలుగు ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా‘ లో బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్న విషయం అందరికి తెలుసు.
ఈ ఎపిసోడ్ ఈ రోజు ఆహా లో స్ట్రీమింగ్ అయ్యింది.ఈ ఫస్ట్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ పేరుతొ బాలయ్య టాక్ షో స్టార్ట్ అయ్యింది.
దీపావళి సందర్భంగా ఈ రోజు ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసారు.ఉదయం 11.20 నిముషాల నుండి స్ట్రీమింగ్ అయినా ఈ షో లో నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ సాంగ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.డాన్స్ తో పాటు డైలాగ్స్ తో కూడా బాలయ్య అదర గొట్టాడు.ఇప్పటికే ఈ షో లో ఎవరు గెస్ట్ గా వస్తున్నారో ప్రోమో ద్వారా చూపించారు.
ఈ షో చుసిన అభిమానులు బాలయ్య కాస్ట్యూమ్స్ కూడా అదిరి పోయాయని చెప్తున్నారు.
ఇక ఈ షో లో మోహన్ బాబు మొదటి గెస్ట్ గా వచ్చారు.ఆయనతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఈ షోకు రావడంతో పాటు వీరి మధ్య ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది.బాలయ్య మోహన్ బాబును కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అడిగారు.
అందులో భాగంగానే బాలయ్యకు విలన్ గా చేయడానికి రెడీ అంటూ మోహన్ బాబు చెప్పడంతో ఇప్పుడు ఆ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బాలయ్య సినిమాలో విలన్ పాత్రలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనకు తగ్గట్టుగా విలన్ రోల్ ను డైరెక్టర్స్ డిజైన్ చేస్తారు.ఈ క్రమంలోనే ఈ షో లో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ బాలయ్య హీరో అయితే నాకు విలన్ గా చేయడానికి ఎలాంటి అభ్యన్తరం లేదని మోహన్ బాబు చెప్పడంతో ఇప్పుడు ఈ సంభాషణ ఆసక్తిగా మారింది.
మరి చూడాలి బాలయ్య, మోహన్ బాబు కాంబోలో మూవీ వస్తుందో లేదో.