ట్రక్కర్ల ఆందోళన : కెనడా రాజధానిని తిరిగి స్వాధీనం చేసుకున్న పోలీసులు..!!

అమెరికా- కెనడా మధ్య రవాణా సేవలు అందించే ట్రక్కర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.ట్రూడో సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రాజధాని ఒట్టావాను ముట్టడించారు.

 Police Reclaim Canada Capital After Trucker Siege Ends , Canada , Trucker, Capi-TeluguStop.com

రోజురోజుకు పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో ప్రధాని జస్టిన్ ట్రూడో ఎమర్జెన్సీ సైతం విధించారు.ట్రక్కు డ్రైవర్ల నిరసనల కారణంగా జనజీవనం స్తంభించిపోయిన క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రూడో వెల్లడించారు.

కెనడా ప్రజల భద్రతను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.అయితే దీని కారణంగా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో బలప్రయోగం ద్వారానైనా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది.

ఈ చర్యలు ఫలించి రాజధాని ఒట్టావా నగరం తిరిగి భద్రతా దళాల చేతుల్లోకి వచ్చింది.దాదాపు నెల రోజుల తర్వాత నగరం ఆదివారం ప్రశాంతంగా కనిపించింది.రెండు రోజుల పాటు ట్రక్కర్లను ఎదుర్కొన్న పోలీసులు వారిని పార్లమెంట్ హిల్ వెలుపల నుంచి తరిమికొట్టారు.

చాలాకాలం పాటు చికాకు పెట్టిన ట్రక్కర్ల నిరసన, రణగొణ ధ్వనులు తప్పిపోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఒట్టావా తాత్కాలిక పోలీస్ చీఫ్ స్టీవ్ బెల్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.చాలామంది నిరసనకారులు నగరాన్ని విడిచి వెళ్లిపోయారని తెలిపారు.కానీ ఆపరేషన్ ఇంకా ముగియలేదని.వీధులను ఆందోళనకారులు మళ్లీ ఆక్రమించుకోవడానికి వీల్లేకుండా చూస్తున్నామని స్టీవ్ బెల్ వెల్లడించారు.

కొందరు ఉద్యమకారులు శనివారం రాత్రి వరకు రోడ్లపైననే వుండి, 80ల నాటి నిరసన గీతాలను ఆలపిస్తూ.పార్లమెంట్ వెలుపల బాణాసంచా కాల్చారు.

పోలీసులు 200 హెక్టార్ల డౌన్‌టౌన్ ప్రాంతం వరకే ప్రజలను అనుమతిస్తూ చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నారు.అయితే ట్రక్కర్ల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను రక్షించుకోవడానికి బలగాలను మోహరిస్తున్నారు.స్థానికులు, కార్మికులు మినహా మరెవరిని ఒట్టావా పోలీసులు అనుమతించడం లేదు.నగరాన్ని ఖాళీ చేయాలని లేని పక్షంలో అరెస్ట్ తప్పదని మిగిలి వున్న నిరసనకారులను హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube