ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలో ఒక్కో నేత చల్లగా జారుకుంటున్నారు.అప్పటి వరకూ అబ్బే అదేమీ లేదు అంటూ సమాధానాలు ఇస్తున్న సదరు నేతలు మరుసటి రోజు వైసీపీ కండువా కప్పుకుని చంద్రబాబు పై విమర్శలు చేస్తూ షాక్ లు ఇస్తున్నారు.
ఇప్పటికే ఎంతో మంది నేతలు టీడీపీ ని వీడి వైసీపీలోకి వెళిపోయిన విషయం అందరికి తెలిసిందే.అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.
టీడీపీ నుంచీ పశ్చిమ గోదావరి లో అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి పక్క పార్టీ వైపు తొంగి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సదరు నేత పేరు ఇప్పుడు మారుమోగుతోంది.ఇంతకీ ఆ మంత్రి ఎవరో కాదు పితాని సత్యన్నారాయణ.ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచీ నేరుగా పోటీ చేసి నెగ్గిన పితాని…
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు.
అయితే పితాని వరుసగా రెండు సార్లు ఆచంట నియోజకవర్గం నుంచీ పోటీ చేసి గెలిపొందారు.ఈ సారి టీడీపీ నుంచీ పోటీ చేస్తే ఓటమి తప్పదని గ్రహించిన ఆయన ఇప్పుడు పార్టీ మారనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే బాబు కి అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారట పితాని.అయన పార్టీ మారకుండా ఉండటానికి ఎంతగా ప్రయత్నించినా సరే ప్రయోజనం లేదని అంటున్నారట అక్కడి స్థానిక నేతలు.
అయితే చంద్రబాబు ఇంతగా పితాని విషయంలో పాకులాడటానికి గల కారణం ఏమిటంటే.ఇప్పటి వరకూ టీడీపీ కి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే రాజీనామాలు చేశారు తప్ప సాక్షాత్తు ఏపీ మంత్రులు పార్టీ మారిన పరిస్థితి లేదు దాంతో, ఒక వేళ మంత్రి హోదాలో గనుక పితాని పార్టీ వీడితే మాత్రం ఆ ప్రభావం పార్టీపై తీవ్ర స్థాయిలో ఉంటుందని అనడంలో సందేహం లేదని చెప్పాలి.