టీఆర్ఎస్ వైపు చూస్తున్న బీజేపీ నేత.. ?

నిప్పుకున్న తత్వం ఒక్కటే.దేన్నైనా కాల్చి బూడిద చేయడం.

 Peddapelli, Bjp, Somarapu Satyanarayana, Trs, Bjp Somarapu Satyanarayana, Bjp Le-TeluguStop.com

అయితే అది ఉపయోగించుకునే వారిని బట్టి ఉంటుంది.ఇక రాజకీయాల్లో ఉన్న వారిని నాయకులు అంటారు.

వీరితత్వం కూడా ఒక్కటే.అదే గోడ మీది పిల్లులుగా వ్యవహరించడం.

ఒక పార్టీలో తమకు అనుకూలంగా లేకుంటే మరో పార్టీ కండువా కప్పుకుంటారు.అక్కడ కూడా ఇదే పరిస్దితి ఉంటే మరో పార్టీ.

ఇలా పరిస్దితులు తమకు అనుకూలంగా మారేదాక బొంగరంలా తిరుగుతుంటారు.
నిజంగా ప్రజలకు సేవచేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వారికి పదవులతో సంబంధం లేదు.

స్వలాభం కోసం వచ్చిన వారే పదవులను ఆశిస్తూ పార్టీలు మారుతారు.ఇప్పుడు మనం తెలుసుకునేది ఇలాంటి నాయకుని గురించే.

అతడే సోమారపు సత్యనారాయణ.ఇతను మొదట కాంగ్రెస్లో ఉన్నారు ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు.

ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు.ఆ పార్టీలో ఇమడలేక బీజేపీలో చేరారు.

కాగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోమారపు సత్యనారాయణ ప్రస్తుతం రాజీనామా చేశారట.తనకు తగినంత గుర్తింపు దక్కక పోవడంతో ఈ పార్టీల కంటే టీఆర్ఎస్ నయం అనుకుని మళ్లీ ఈ పార్టీలో చేరుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుందట.

అయితే టీఆర్ఎస్ పార్టీలోకి సోమారపు సత్యనారాయణ వస్తే అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారిందట.కాగా ఈయన రాకను సీఎం కేసీఆర్ స్వాగతిస్తారా లేదా అనేది తెలియవలసి ఉందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube