ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె దాదాపు నెల రోజులు అవుతుంది.ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది.

 Negotiations With Rtc Workers Fail-TeluguStop.com

ఎట్టకేలకు నిన్న సమ్మె చేస్తున్న కార్మికులతో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు.

విలీనంతో పాటు ఇంకా పలు డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు.కాని ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కూడా విలీనంకు ఒప్పుకునేది లేదు అంటూ తేల్చి చెప్పారు.

నిన్న ఆర్టీసీ కార్మికులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో పలు విషయాలను లేవనెత్తారు.ప్రభుత్వ ప్రతినిధులు కార్మికుల పలు డిమాండ్లకు సమ్మతించారు.కాని కార్మికులు కోరుతున్నట్లుగా ప్రభుత్వంలో విలీనానికి మాత్రం ఒప్పుకోవడం లేదు.దాంతో సమ్మె కంటిన్యూ చేస్తాం అంటూ కార్మికులు చర్చల నుండి బయటకు వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కాని కార్మికులు మాత్రం చర్చల నుండి మేము బయటకు రాలేదు అంటూ చెబుతున్నారు.వారు మేము అడిగే ఏ ఒక్క డిమాండ్‌కు అంగీకరించకుండా మొండి పట్టుదల పట్టారంటూ కార్మికులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube