ఏపీ సీఎం జగన్ ఇసుక కొత్త విధానం తీసుకు వస్తామంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే ఇప్పటి వరకు ఇసుక విషయమై కొత్త విధానంను తీసుకు రాకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజు వారి పనులు చేసుకునే వారు కనీస అవసరాలకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.ఈ విషయమై ప్రభుత్వంపై తెలుగు దేశం మరియు జనసేన పార్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాయి.
భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో రోడ్డున పడే పరిస్థితికి జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.ఈ సమయంలోనే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో కూడా ఎక్కువ వ్యతిరేకత పెరుగుతోంది.
ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఇసుక కొరత వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుందని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు.ఈ విషయమై అత్యంత బాధాకరంగా భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం వెంటనే ఏదైనా చర్యలు తీసుకోకుంటే మరింతగా ప్రభుత్వంకు డ్యామేజీ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







