ప్రత్యేక ఆకర్షణతో రూపుదిద్దుకున్న పైనాపిల్ వినాయకుడు ..

తుమ్మలగుంటలో ఈ ఏడాది చవితికి ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణతో రూపుదిద్దుకున్న పైనాపిల్ వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు.బుధవారం వినాయక చవితి సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు.

 Pineapple Ganesha Shaped With Special Charm ,pineapple Ganesh , Ganapathi , Idol-TeluguStop.com

తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం పైనాపిల్ వినాయకుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏటా వినాయక చవితిని పురస్కరించుకొని ప్రత్యేకతను చాటుకునేలా.పర్యావరణ పరిరక్షణకు తమ్ముడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.

పర్యావరణ పరిరక్షణకు ఆధ్యాత్మిక వాతావరణంలో సంకల్పించిన చెవిరెడ్డి అభినందనీయుడు అని ప్రశంసించారు.

భారీ పైనాపిల్ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసేందుకు 25 మంది కార్మికులు 16 రోజులు పాటు శ్రమించి 7వేల పైనాపిల్స్ తో భారీ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

హైదరాబాద్ చలన చిత్ర రంగం నుంచి వచ్చిన ప్రముఖ ఆర్కిటెక్చర్ మురళి సారధ్యంలో 22 అడుగులు ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో అతి పెద్ద పైనాపిల్ వినాయకుని ప్రతిమను సిద్దం చేయించడాన్ని అభినందించారు.బాల వినాయక కమిటీ ఛైర్మన్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు సభ్యులందరూ పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారని అభినందనలు తెలియజేశారు.

పైనాపిల్ వినాయకుని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్లు ఉన్న బాల వినాయకులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.

చెరుకు గడలతో పైనాపిల్ వినాయక మండపాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.నిర్వాహకులు.

అలాగే 1116 కిలోల లడ్డూ పైనాపిల్ వినాయకుడి ముందు ఏర్పాటు చేశారు.వేద పండితుల ముఖ్య అతిథులను ఆశీర్వదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube