దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసిన మరుపురాని చిత్రాల్లో శ్రీకాంత్ పెళ్లి సందడి కూడా ఒకటి.ఈ సినిమాతో శ్రీకాంత్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి పాటలు కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
ఎంత హిట్ అయ్యాయంటే ఇప్పటికి ఈ సాంగ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో.
ప్రస్తుతం రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందD‘ అనే సినిమాలో కొత్త తరం జంటతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుంటే తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో పెళ్లి సందD టీమ్ అంత చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ప్రమోషన్స్ జోరుగా చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలనీ ట్రై చేస్తున్నారు.

ఏ ఛానల్ చుసిన పెళ్లి సందD టీమ్ నే కనిపిస్తున్నారు.దసరా ఈవెంట్స్ తో పాటు ఇటు న్యూస్ ఛానెల్స్ లో కూడా వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ సందD చేస్తున్నారు.ఈ సినిమాపై ఆడియెన్స్ కు మరింత ఆసక్తి పెంచేలా ప్రమోషన్స్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అవుతుంది.
ఆఖరికి రాఘవేంద్రరావు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమా గురించి బజ్ క్రియేట్ చేస్తున్నారు.ఈ సినిమా కూడా రాఘవేంద్ర రావు మార్క్ కనిపిస్తుండడంతో ఖచ్చితంగా విజయం సాదిస్తుందని అంత భావిస్తున్నారు.