పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక వైపు రాజకీయాలు చేస్తూ పార్ట్ టైమ్ గా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా లు ఒకొక్కటి చొప్పున పూర్తి చేయకుండా ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యి ఒక వైపు నిర్మాతలను మరో వైపు దర్శక నిర్మాతలను చిరాకు పెడుతున్నాడు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారగంగా పుకార్లు షికార్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితం మొదలు పెట్టి హరిహర వీరమల్లు సినిమా ఇంకా ముగియలేదు.
ఆ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయింది అంటున్నారు.ఆ తర్వాత రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు.ఆ సినిమా షూటింగ్ అయితే ప్రారంభం అయింది కానీ ఎంత షూట్ అయింది అనేది క్లారిటీ లేదు.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆ రెండు సినిమా లను ఎప్పుడు పూర్తి చేస్తాడు అనేది తెలియదు.
ఇక ఓజీ సినిమాను ఆ మధ్య మొదలు పెట్టి స్పీడ్ స్పీడ్ గా షూటింగ్ చేశాడు.కానీ ఇప్పుడు మాత్రం ఆ సినిమాను కూడా పక్కన పెట్టేశాడు అంటూ టాక్ వస్తుంది.వచ్చే నెలలో లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కి హాజరు అవుతాడట.ఓజీ సినిమా కోసం కూడా అక్టోబర్ లో ఒక షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మొత్తానికి అత్యాశతో చాలా సినిమాలు కమిట్ అయి ఏదో ఒకటి పూర్తి చేయకుండా గందరగోళం క్రియేట్ చేస్తున్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.పవన్ ఒకొక్క సినిమా చొప్పున పూర్తి చేస్తే బాగుంటుంది అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.