ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిలోపు సమయం మాత్రమే ఉంది.అంతకంటే ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం( YCP ) ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి.
ఇప్పటికే టిడిపి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించగా, జనసేన ( Janasena ) సైతం జనాల్లో బలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనే లక్ష్యంతో జనసేన టిడిపిలు ఉన్నాయి.
రెండు పార్టీలు కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, టిడిపి, జనసేనలు తమ క్యాడర్ ను సిద్ధం చేసుకుంటున్నాయి.
ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా, తమ విజయానికి డోకా లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.దీనిలో భాగంగానే జనసేన తమ ఎన్నికల ప్రచారం రధం వారాహిని రంగంలోకి దించబోతోంది.
చాలా కాలంగా వారాహి ( Varahi ) ద్వారా ఏపీలో పర్యటించాలని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భావించినా, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది.అయితే ముందస్తు ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో వారాహి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.ఈ యాత్రకు ఎటువంటి ఆడటంకాలు లేకుండా ఈ యాత్ర సాగే నియోజకవర్గం కు కో ఆర్డినేటర్లను జనసేన పార్టీ నియమించింది.ఇద్దరు చొప్పున సీనియర్ నాయకులు కోఆర్డినేటర్లుగా నియమించింది.
యాత్ర సాగే నియోజకవర్గం పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు, జన సమీకరణ చేయడం, జనసేన గ్రాఫ్ గ్రామ స్థాయి నుంచి పెరిగే విధంగా కోఆర్డినేటర్లకు బాధ్యతను అప్పగించారు.
నియోజకవర్గాల వారీగా జనసేన వారాహి కోఆర్డినేటర్లు … నర్సీపట్నం బొలిశెట్టి సత్యనారాయణ, ఒంపూరు గంగులయ్య, పాయకరావుపేట గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్, ఎలమంచిలి బండ్రెడ్డి రామకృష్ణ, బేతపూడి విజయ్ శేఖర్, తుని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర, ప్రత్తిపాడు చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ, పిఠాపురం బొమ్మిడి నాయకర్, చల్లపల్లి శ్రీనివాస్, కాకినాడ రూరల్ నాయూబ్ కమల్, కాకినాడ అర్బన్ గాదె వెంకటేశ్వరరావు, ముమ్మడివరం బొలిశెట్టి సత్యనారాయణ, అమలాపురం బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, గన్నవరం గడసాల అప్పారావు, రాజోలు చిలకం మధుసూదన్ రెడ్డి లను నియమించారు.అలాగే జనవాణి కార్యక్రమ కోఆర్డినేటర్ గా వరప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు.