పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పని అల్లు అర్జున్.. కారణమిదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలలో సంచలన విజయాలతో ఇటు రాజకీయాలలో మార్పు కోసం ఎంతో కష్టపడుతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలు ఉన్నాయి.

 Pawan Kalyan Fans Fire On Allu Arjun Details, Allu Arjun ,birthday Wishes, Ntr F-TeluguStop.com

పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు.అల్లు అరవింద్ తాజాగా మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని వెల్లడించిన సంగతి తెలిసిందే.

చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అల్లు అర్జున్ వెల్లడించారు.సోషల్ మీడియాలో కూడా బన్నీ చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా విష్ చేయడానికి మాత్రం బన్నీ ఆసక్తి చూపకపోవడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బన్నీ ఫ్యాన్స్ మాత్రం మరో విధంగా చెబుతున్నారు.

Telugu Allu Aravind, Allu Arjun, Allu Arjun Fans, Allu, Wishes, Ntr Fans, Pawan

సోషల్ మీడియా వేదికగా విష్ చేయనంత మాత్రాన బన్నీ పవన్ కు విషెస్ చెప్పలేదని ఏ విధంగా డిసైడ్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బన్నీ ఫోన్ లో విష్ చేసి ఉండవచ్చని బన్నీ అభిమానులు చెబుతున్నారు.

ఈ విషయంలో అల్లు అర్జున్ ను అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో బన్నీని విమర్శించే వాళ్లు సైతం అదే స్థాయిలో ఉన్నారు.మరోవైపు బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కుతోంది.

వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube