పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా నేడు విడుదల కావడంతో థియేటర్ల వద్ద మెగా ఫాన్స్ కోలాహలం కనిపించింది.నాచారం వైజయంతి థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేశారు.
పవన్ కళ్యాణ్ అభిమాని వంగరి సాయికుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ కు దండలు వేసి, పాలభిషేకం చేశారు.అనంతరం కొబ్బరికాయ కొట్టి హారతి అందించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నినాదాలు చేశారు.బ్రో సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.