ప్రెజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చించు కుంటున్న సినిమా ఏంటి అంటే అది కింగ్ ఖాన్ షారుఖ ఖాన్ నటించిన పఠాన్ సినిమా అనే చెప్పాలి.ఎందుకంటే బాలీవుడ్ గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతం అవుతుంది.
కొన్ని రోజులుగా బాలీవుడ్ 100 కోట్ల సినిమాలు కూడా చేయలేక ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.
మరి అలాంటి తరుణంలో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.అప్పటి నుండి పఠాన్ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తుంది.
మొత్తం వరల్డ్ వైడ్ గా ఆశ్చర్య పరిచే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా బాలీవుడ్ కు పూర్వ వైభవం తెచ్చింది.
ఇక ఇప్పుడు యూఎస్ లోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి పఠాన్ మరోసారి వార్తల్లో నిలిచింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యూఎస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ సినిమాగా నిలిచింది.11 రోజుల్లోనే ఈ సినిమా 13 మిలియన్ డాలర్లకు పైగానే వసూళ్లను రాబట్టింది.లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది.