బిగ్ బాస్ 7 లో పల్లవి ప్రశాంత్ పరువు తీసేసిన రతికా..ట్విస్ట్ మామూలుగా లేదు!

కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ 7( Bigg Boss 7 ) రీసెంట్ గానే గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే.ఇంతకు ముందు సీజన్స్ లో లాగ కాకుండా ఈ సీజన్ చాలా కొత్తగా ఉంటుందని, ‘ఉల్టా పల్టా’ ( Ulta Palta )అంటూ నాగార్జున ప్రోమోస్ లో ఊదరగొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Pallavi Prashant's Insult In Bigg Boss 7 Rathika The Twist Is Not Usual , Bigg B-TeluguStop.com

పవర్ అస్త్ర ని సాధించుకోవడమే కంటెస్టెంట్స్ లక్ష్యం అని నాగార్జున మొదటి రోజే చెప్పాడు.అప్పట్లో దీని పవర్ ఎవరికీ తెలియలేదు కానీ, మొన్న సందీప్( Sandeep ) పవర్ అస్త్ర గెలుచుకున్నప్పుడు అందరికీ అర్థం అయ్యింది.

ఈ టాస్కు లో గెలిచినందుకు గాను ఆయనకీ 5 వారాలు ఇమ్యూనిటీ లభించింది.అంటే 5 వారాల పాటు ఆయనని ఎవ్వరూ నామినేట్ చెయ్యడానికి వీలు లేదు అన్నమాట.

ఇకపోతే మొదటి వారం ఎలిమినేషన్స్ లో కిరణ్ రావు హౌస్ నుండి బయటకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Amardeep, Bigg Boss, Damini, Gautham, Priyanka, Rathika, Sandeep-Latest N

అయితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపేయడానికి పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) ని టార్గెట్ చేసినట్టుగా కాసేపటి క్రితం విడుదలైన ప్రోమో ని చూస్తే అర్థం అవుతుంది.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి పల్లవి ప్రశాంత్ ప్రవర్తన కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, ప్రేక్షకులకు కూడా ఓవర్ యాక్షన్ లాగ అనిపించింది.మాటికొస్తే రైతు బిడ్డ అని చెప్పుకుంటూ సింపతీ తో ఓట్లు రప్పించుకోవడానికి పల్లవి ప్రశాంత్ ప్రయత్నిస్తున్నాడు.

దీనిని హౌస్ మేట్స్ అందరూ కలిసి ఈరోజు బ్రేక్ చేసినట్టుగా అనిపించింది.అమర్ దీప్, రతికా , సందీప్, గౌతమ్, దామిని , ప్రియాంక పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసారు.

ఇక పల్లవి ప్రశాంత్ వేస్తున్న రైతు బిడ్డ సెంటిమెంట్ డ్రామా ని అమర్ దీప్ నిలదీసి కడిగిపారేసాడు.ఆయన ఎత్తిన పాయింట్స్ కి హౌస్ మేట్స్ నుండి చప్పట్లు కూడా పడ్డాయి.

Telugu Amardeep, Bigg Boss, Damini, Gautham, Priyanka, Rathika, Sandeep-Latest N

ఇదంతా ఒక ఎత్తు అయితే, పల్లవి ప్రశాంత్ తో మొదటి రోజు నుండి ఎంతో ఫ్రెండ్లీ గా ఉన్న రతికా కూడా నామినేట్ చెయ్యడం అసలు సిసలైన ట్విస్ట్.బిగ్ బాస్ లోకి అవకాశం దక్కించుకోవడం కోసం ఈ అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కుక్క లాగ తిరిగాను అని అంటాడు పల్లవి ప్రశాంత్.అప్పుడు రతికా అంత కుక్కలాగా తిరిగినోడివి హౌస్ లోకి వచ్చిన తర్వాత నువ్వేమి చేస్తున్నావ్ అని నిలదీస్తుంది.ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ మైండ్ బ్లాక్ అయిపోయింది.రతికా అతనితో మొదటి రోజు నుండి చాలా ఫ్రెండ్లీ గానే ఉంది, కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం ఆమె ఈయనకి లైన్ వేస్తున్నట్టు ఊహల్లో తేలిపోతున్నాడు.ఆయన ఆమెని ప్రేమించడం మొదలు పెట్టాడు , రతికా అందుకే ఈ నామినేషన్ ద్వారా అతని ఊహలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube