స్నేహితులను నమ్మి నా కొడుకు మోసపోయాడు.. చనిపోవాలనుకున్నాడు: పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు

బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లో రైతు బిడ్డగా కొనసాగుతున్నటువంటి పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు.ఈయన యూట్యూబ్ వీడియోలు రీల్స్ చేసుకుంటూ తన వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలను అభిమానులతో పంచుకునేవారు.

 Pallavi Prashanth Parents Reveal About His Suicide Attempts , Bigg Boss, Pallavi-TeluguStop.com

అయితే తనకు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనాలని ఉంది అంటూ ఈయన పలుమార్లు చెప్పడంతో ఈసారి ఈయనకు అవకాశం కల్పించారు.అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ తల్లితండ్రులు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కొడుకు గురించి పలు విషయాలు తెలియజేశారు.

Telugu Bigg Boss-Movie

నా కొడుకు ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.అయితే ఈ కార్యక్రమంలో అమర్ దీప్ ( Amar Deep )నా కొడుకును ఏందిరా అన్నప్పుడు చాలా బాదేసిందని ఈయన తెలియజేశారు.ఇక నా కొడుకుని రైతుబిడ్డ అంటూ అక్కడ మాట్లాడుతున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరూ సమానమేనని ఈయన తెలియజేశారు.ఇక నా కుమారుడు ఒక లవ్ సాంగ్ చేసి ఏడు లక్షల రూపాయలు సంపాదించారని ఈ సందర్భంగా ప్రశాంత తల్లిదండ్రులు తెలియజేశారు.అయితే స్నేహితులను నమ్మి ఆ డబ్బులు అన్నింటిని పోగొట్టుకున్నారని స్నేహితుల చేతిలో మోసపోయారని తెలిపారు.

Telugu Bigg Boss-Movie

ఇలా స్నేహితులు తనని మోసం చేయడంతో ఒకసారి ఇస్తాను చనిపోతానంటూ పొలం వద్దకు వెళ్లిపోయారు.అయితే తనకు ఏ కష్టం వచ్చినా అండగా నేను ఉంటానని బ్రతిమలాడి నా కొడుకుని కాపాడుకున్నానని, ఆ తర్వాత తనకు ఫోన్ తీసి ఇవ్వడంతో రీల్స్ చేసుకుంటూ బాగా గుర్తింపు సంపాదించుకున్నారని ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తన గురించి తెలియజేశారు.ఇక తన కుమారుడి పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ తను జీవితంలో కొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తానని అయితే పెళ్లి మాట ఎత్తితే మాత్రం తాను ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాను అంటూ తన కొడుకు వార్నింగ్ ఇచ్చారని తెలియజేశారు.ఇక బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత తనతో మరోసారి పెళ్లి గురించి మాట్లాడుతానని ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube