ప్రారంభమైన పద్మా వంతెన.. ఎంత పొడుగో.. మరిన్ని ప్రత్యేకతలు ఇవే!

మల్టీపర్పస్ రైలు-రోడ్డు బ్రిడ్జి తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రారంభమైంది.పద్మా నదిపై నిర్మించిన ఈ లార్జెస్ట్ బ్రిడ్జిని ఆ దేశ పీఎం షేక్‌ హసీనా జులై 25న లాంచ్ చేశారు.ఈ బ్రిడ్జి 6.241 కిలోమీటర్లు పొడవు ఉండటం విశేషం.అంటే ప్రస్తుతం రామేశ్వరంలో నిర్మిస్తున్న పంబన్ బ్రిడ్జి కంటే మూడు రెట్లు ఇది పొడవైనది.అత్యంత పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోనే మోస్ట్ లాంగెస్ట్ బ్రిడ్జిగా కూడా చరిత్ర సృష్టించింది.

 Padma Bridge Opened How Long , Longest Bride, Viral Latest, News Viral, Social-TeluguStop.com

ఈ బ్రిడ్జి వల్ల కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకి చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

10 వేల టన్నుల లోడ్ లిమిట్‌, 18.18 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉన్న ఈ అతిపెద్ద బ్రిడ్జిని 2014 నవంబర్ 6న నిర్మించడం ప్రారంభించారు.ఈ వంతెన అందుబాటులోకి రాగా ఇప్పుడు దేశ రాజధాని ఢాకా… ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యాపారాలకు అత్యంత ముఖ్యమైన మోంగ్లా ఓడరేవుకి మధ్య దూరం మరింత తగ్గిపోయింది.ఈ బ్రిడ్జి కింద సింగిల్ రైల్వే ట్రాక్ ఉండగా పైన ఫోర్ వే రోడ్డు ఉంది.

ఈ వంతెన గురించి బంగ్లాదేశ్ చాలా గర్వంగా చెప్పుకుంటుంది.ఇది జస్ట్ ఇటుకలు, సిమెంట్, స్టీల్‌, కాంక్రీట్‌ గల నిర్మాణమే కాదని, తమ దేశ శక్తి సామర్థ్యాలు, గౌరవానికి ప్రతీక అని తాజాగా ప్రధాని హసీనా చెప్పారు.

బ్రిడ్జి బంగ్లాదేశ్ లో నిర్మించిన అత్యంత ఛాలెంజింగ్ నిర్మాణంలో ఒకటి.ఈ వంతెనతో బంగ్లాదేశ్ స్థూల దేశీయోత్పత్తి 1.2 శాతం పెరగనుంది.బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల ప్రజల కల ఈ వంతెన కోసం ఎన్నో రోజులుగా కలలు కంటున్నారు.

ఇప్పుడు అది అందుబాటులోకి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Bangladesh, Longest, Longest Bridge, Padma Bridge, Latest-Latest News - T

ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం 3.6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.28 వేల కోట్లు) వెచ్చించారు.ఈ నిర్మాణం చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు కూడా చుట్టుకున్నాయి.ముఖ్యంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వమని కరాఖండిగా చెప్పింది.దీంతో చేసేది లేక ప్రభుత్వ నిధులతో ఈ వంతెనను బిల్డ్‌ చేశారు.నిర్మించారు.

ఆ విధంగా పూర్తయిన ఈ వంతెన నైరుతి బంగ్లాదేశ్‌లోని 19 జిల్లాలను, ఢాకాతోపాటు మరికొన్ని ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది.చైనా ఆధారిత రైల్వే మేజర్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ గ్రూప్‌ వంతెనను నిర్మించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube