ప్రారంభమైన పద్మా వంతెన.. ఎంత పొడుగో.. మరిన్ని ప్రత్యేకతలు ఇవే!

మల్టీపర్పస్ రైలు-రోడ్డు బ్రిడ్జి తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రారంభమైంది.పద్మా నదిపై నిర్మించిన ఈ లార్జెస్ట్ బ్రిడ్జిని ఆ దేశ పీఎం షేక్‌ హసీనా జులై 25న లాంచ్ చేశారు.

ఈ బ్రిడ్జి 6.241 కిలోమీటర్లు పొడవు ఉండటం విశేషం.

అంటే ప్రస్తుతం రామేశ్వరంలో నిర్మిస్తున్న పంబన్ బ్రిడ్జి కంటే మూడు రెట్లు ఇది పొడవైనది.

అత్యంత పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోనే మోస్ట్ లాంగెస్ట్ బ్రిడ్జిగా కూడా చరిత్ర సృష్టించింది.

ఈ బ్రిడ్జి వల్ల కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకి చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.

దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.10 వేల టన్నుల లోడ్ లిమిట్‌, 18.

18 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉన్న ఈ అతిపెద్ద బ్రిడ్జిని 2014 నవంబర్ 6న నిర్మించడం ప్రారంభించారు.

ఈ వంతెన అందుబాటులోకి రాగా ఇప్పుడు దేశ రాజధాని ఢాకా.ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యాపారాలకు అత్యంత ముఖ్యమైన మోంగ్లా ఓడరేవుకి మధ్య దూరం మరింత తగ్గిపోయింది.

ఈ బ్రిడ్జి కింద సింగిల్ రైల్వే ట్రాక్ ఉండగా పైన ఫోర్ వే రోడ్డు ఉంది.

ఈ వంతెన గురించి బంగ్లాదేశ్ చాలా గర్వంగా చెప్పుకుంటుంది.ఇది జస్ట్ ఇటుకలు, సిమెంట్, స్టీల్‌, కాంక్రీట్‌ గల నిర్మాణమే కాదని, తమ దేశ శక్తి సామర్థ్యాలు, గౌరవానికి ప్రతీక అని తాజాగా ప్రధాని హసీనా చెప్పారు.

ఈ బ్రిడ్జి బంగ్లాదేశ్ లో నిర్మించిన అత్యంత ఛాలెంజింగ్ నిర్మాణంలో ఒకటి.ఈ వంతెనతో బంగ్లాదేశ్ స్థూల దేశీయోత్పత్తి 1.

2 శాతం పెరగనుంది.బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల ప్రజల కల ఈ వంతెన కోసం ఎన్నో రోజులుగా కలలు కంటున్నారు.

ఇప్పుడు అది అందుబాటులోకి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. """/" / ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం 3.

6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.28 వేల కోట్లు) వెచ్చించారు.

ఈ నిర్మాణం చుట్టూ కొన్ని కాంట్రవర్సీలు కూడా చుట్టుకున్నాయి.ముఖ్యంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వమని కరాఖండిగా చెప్పింది.

దీంతో చేసేది లేక ప్రభుత్వ నిధులతో ఈ వంతెనను బిల్డ్‌ చేశారు.నిర్మించారు.

ఆ విధంగా పూర్తయిన ఈ వంతెన నైరుతి బంగ్లాదేశ్‌లోని 19 జిల్లాలను, ఢాకాతోపాటు మరికొన్ని ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది.

చైనా ఆధారిత రైల్వే మేజర్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ గ్రూప్‌ వంతెనను నిర్మించింది.

మ‌ధుమేహం ఉన్న‌వారు కొబ్బ‌రి నీళ్లు తాగొచ్చా?