అమ్మాయిలు ఈమద్య కాలంలో పలు విషయాల్లో, రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు.అన్ని రంగాల్లో కూడా మగవారితో పోల్చితే ఒక అడుగు ముందే ఉండేందుకు చాలా కష్టపడుతున్నారు.
అది ఏ రంగం అయినా కూడా మగవారికి పోటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.ఇక గుర్రపు స్వారీ అనేది ఆడవారు సినిమాల్లో చేయడమే మనం చూశాం.
కాని చాలా అరుదుగా మాత్రమే అమ్మాయిలు గుర్రపు స్వారీ చేయడం రియల్ లైఫ్‌లో జరుగుతుంది.అది కూడా ఎవరు లేని చోట, కొద్ది దూరం అమ్మాయిలు గుర్రపు స్వారీ చేస్తారు.
కాని కేరళకు చెందిన ఒక అమ్మాయి మాత్రం తన ఇంటి నుండి పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రం వరకు కూడా గుర్రంపైనే వెళ్లింది.పరీక్ష రాసేందుకు ఆ అమ్మాయి బ్యాగ్ వేసుకుని పరీక్ష కేంద్రంకు వెళ్లడం వైరల్ అయ్యింది.మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర కూడా ఆ అమ్మాయి గుర్రపు స్వారీకి ఫిదా అయ్యాడు.నిజంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఈ వీడియోను చూసి ఇన్ఫైర్ అవ్వాలని పిలుపునిచ్చాడు.
ఆ అమ్మాయి గురించిన పూర్తి వివరాలు నాకు తెలియాలని కోరాడు.ఇలాంటి విషయాల్లో ఆనంద్ మహేంద్ర చాలా ఆసక్తిని కనబర్చుతారు.
కేరళ వెళ్లినప్పుడు ఆమెను ఆయన తప్పకుండా కలుస్తాడు.
కొందరు ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతారు అంటారు.కాని ఈ అమ్మాయి మాత్రం ఒకే ఒక్కసారి గుర్రంపై కనిపించి స్టార్ అయ్యింది.అందంతో పాటు, దైర్య సాహసాలు ఉన్న ఈ మలయాళి అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు బాలీవుడ్ వర్గాల వారు కూడా ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు అంటే ఈఅమ్మడి సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఎవరికైనా టైం రావాలి, ఇప్పుడు ఆ టైం ఈ మలయాళి అమ్మడికి వచ్చింది.ప్రస్తుతం ఆ అమ్మాయి పూర్తి వివరాలు కనుకునే పనిలో నెటిజన్స్ ఉన్నారు.