బాలీవుడ్ కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకుని స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు షారుఖ్ ఖాన్.అయితే షారుఖ్ ఖాన్ ఇది వరకులా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకోలేక పోతున్నాడు.
ఈయన చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే కాకుండా ఈయనను జీరో సినిమాతో పెద్ద జీరో అయ్యాడు అని ట్రోల్ చేసారు.
మరి ఇలాంటి అట్టర్ ప్లాప్ సినిమా తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.
ఈ బిగ్గెస్ట్ సినిమా ఈ రోజు జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య అత్యంత భారీ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో షారుఖ్ అభిమానులు మాత్రమే కాదు.బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చాలా రోజుల తర్వాత వచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.