జిడ్డు చ‌ర్మం వేధిస్తుందా.. ఎగ్ వైట్‌తో చెక్ పెట్టండిలా?

జిడ్డు చ‌ర్మం..

 Egg White, Reduce Oily Skin, Oily Skin, Latest News, Skin Care, Beauty Tips, Bea-TeluguStop.com

చాలా మందిని తీవ్రంగా వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.జిడ్డు చ‌ర్మం వ‌ల్ల చికాకు, అసౌక‌ర్యం, త‌ర‌చూ మొటిమ‌లు రావ‌డం ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందుకే జిడ్డు చ‌ర్మాన్ని నివారించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంది.ఏవేవో క్రీములు, లోష‌న్లు, ఫేస్ వాషులు ఏవేవో వాడుతుంటారు.

వీటి ఫ‌లితాల గురించి ప‌క్క‌న పెడితే.కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయినా జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్ట‌వ‌చ్చు.

ముఖ్యంగా జిడ్డు చ‌ర్మాన్ని నివారించ‌డంలో ఎగ్ వైట్ (కోడి గుడ్డు తెల్ల సొన‌) ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.మ‌రి దీన్ని ఎలా వాడాలో చూసేయండి.

ముందుగా ఒక బౌల్‌లో ఎగ్ వైట్ తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.ఇర‌వై లేదా ముప్పై నిమిషాలు పాటు ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చ‌ర్మంపై ఉన్న జిడ్డు త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే ఎగ్ వైట్ మ‌రియు తేనె రెండిటిని ఒక బౌల్ తీసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ ఎగ్ వైట్ మ‌రియు తేనె మిశ్ర‌మానికి ముఖానికి అప్లై చేసి.

రెండు నిమిషాల పాటు స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో మ‌సాజ్ చేయాలి.ఇక బాగా ఆరిన త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా మూడు రోజుకు ఒక సారి చేసినా జిడ్డు చ‌ర్మం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక ఎగ్ వైట్‌, ముల్తాని మట్టి ఫ్యాక్ కూడా జిడ్డు చ‌ర్మాన్ని నివారించ‌గ‌ల‌దు.

ఒక బౌల్‌లో ఎగ్ వైట్, ముల్తాని మ‌ట్టి తీసుకుని.క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.ఒక పావు గంట పాటు వ‌దిలేయాలి.

అన‌రంతం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube