ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు టీడీపీ, జనసేన పొత్తు కొత్త కాదని పేర్కొన్నారు.
బీజేపీని కలుపుకోవాలని పైకి టీడీపీతో పొత్తు లేనట్లు వ్యవహారించారని తెలిపారు.
టీడీపీతో పొత్తుకు బీజేపీ కలిసిరాకపోవడంతో బయటపడ్డారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
అయితే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా దానిపై తాము కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.దేశంలో అవినీతికి ఆధ్యుడు చంద్రబాబని విమర్శించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును ఎనభై శాతం మంది ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.జనసేన, టీడీపీ పొత్తుతో డిపాజిట్లు మాత్రమే వస్తాయన్న పెద్దిరెడ్డి అందుకే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని విమర్శించారు.