మరో 250 డేస్ లో 'దేవర'.. వస్తున్నా అంటూ సాలిడ్ అనౌన్స్ మెంట్!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR )గ్లోబల్ వైడ్ గా పేరు సంపాదించు కున్నాడు.ఈయన ఆర్ఆర్ఆర్ ( RRR movie )వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా ‘దేవర’.

 Ntr's Devara Countdown Starts , Koratala Shiva, Tollywood, Ntr, Janhvi Kapoor,-TeluguStop.com

ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.

ఫస్ట్ లుక్ లో తారక్ ను మాస్ హీరోగా అదిరిపోయే లుక్ లో చూపించి కొరటాల ఆకట్టు కున్నాడు.

ఇక లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి ఈ సినిమా నుండి అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ రోజు నుండి ఈ సినిమా రిలీజ్ కు కరెక్ట్ గా 250 రోజుల సమయం ఉందని మేకర్స్ అప్డేట్ ఇస్తూ సాలిడ్ పోస్ట్ చేసారు.ఈ సినిమా అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో దేవర( Devara movie ) మరో 250 రోజుల్లో వస్తున్నాడు అంటూ రిలీజ్ కన్ఫర్మ్ చేసేసారు.

ఏప్రిల్ 5, 2024న ఈ సినిమా రిలీజ్ ఖచ్చితంగా ఉంటుందని మరోసారి కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

భారీ మాస్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా మంచి అంచనాలతో ఎదురు చూస్తున్నారు.ఎన్నో అవాంతరాల మధ్య ఈ ఏడాది స్టార్ట్ అయ్యింది.అయితే స్టార్ట్ అయ్యే ముందు ఎంత గ్యాప్ వచ్చిందో ఇప్పుడు అంత జెట్ స్పీడ్ తో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.

కాగా వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube