నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను బీజేపీ నాయకురాలు డీకే అరుణ పరిశీలించారు.మిషన్ కాకతీయ పేరును కమీషన్ల కాకతీయగా మార్చారని విమర్శించారు.
చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేశారని అందుకే మంత్రి వేముల నియోజకవర్గంలో చెరువులకు గండ్లు పడ్డాయని విమర్శలు చేశారు.ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
మోతే సమీపంలో చెక్ డ్యామ్ ల నిర్మాణ లోపాల వలనే వందలాది ఎకరాలు నీట మునిగాయని ఆరోపించారు.రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చలేని వాళ్లు దేశ ప్రజల కష్టాలు తీరుస్తారా అని ప్రశ్నించారు.
రైతుల నష్టానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.







