దేవర ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అలా ప్లాన్ చేసిన కొరటాల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Ntr And Koratala Siva Devara First Single Update, Devara, Ntr, Koratala Shiva, D-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా ఈ లుక్స్ తో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.

ఈ సినిమాలో కొరటాల ఎన్టీఆర్ ను మాత్రమే కాదు విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ను కూడా ఫుల్ మాస్ యాంగిల్ లో చూపించ బోతున్నట్టు లుక్స్ తోనే అర్ధం అయ్యింది.

ఇక ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తుంటాయి.తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అయ్యింది.ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఈ అప్డేట్ తెలుస్తుంది.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Shiva, Ntrkoratala, Saif Ali Khan-Movie

ఇప్పటి వరకు రెగ్యురల్ ప్రమోషన్స్( Regular promotions ) స్టార్ట్ చేయలేదు.కానీ వన్స్ స్టార్ట్ చేస్తే ఇక ఆగరు అని తెలుస్తుంది.ఆ విధంగా కొరటాల ప్లాన్ రెడీ అవుతుందట.

ఎన్టీఆర్ కూడా ప్రమోషన్స్ తోనే బిగ్ ఇంపాక్ట్ కలిగించేలా ప్లాన్ చేయాలని మేకర్స్ కు సూచించారని తెలుస్తుంది.తాజాగా ఫస్ట్ సింగిల్ విషయంలో ఆసక్తిగా ఉంది.

అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు ఇచ్చే మ్యూజిక్ ప్లస్ పాయింట్ గా నిలిచేలా చర్యలు జరుగుతున్నాయట.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Shiva, Ntrkoratala, Saif Ali Khan-Movie

ఇక ఫస్ట్ సింగిల్ ఎలా ఉండనుందంటే.దేవర( devara ) చుట్టూ ఉండే ప్రపంచం గురించి అతడి పాత్ర గురించి హైలెట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఉంటాయట.పాన్ ఇండియా రేంజ్ లో పాటలు కూడా హైలెట్ అవ్వాలని ఈసారి మేకర్స్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

చూడాలి ఎలా ఆకట్టుకుంటారో.ఇక యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube