ఏపీలోని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు( TDP Rebel MLA ) నోటీసులు జారీ అయ్యాయి.ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు స్పీకర్ పేషీ తెలిపింది.
రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ ఇచ్చిన పిటిషన్ పై పార్టీ అధ్యక్షహోదాలో చంద్రబాబు అభిప్రాయాన్ని స్పీకర్ పేషీ కోరింది.ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై చంద్రబాబు( Chandrababu Naidu ) స్పీకర్ కు తన అభిప్రాయాన్ని పంపారని తెలుస్తోంది.
పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు.కాగా రెబల్ ఎమ్మెల్యేలు వంశీ, బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు చంద్రబాబు సమాధానం ఇచ్చారని సమాచారం.