రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు మూడు వైపుల నుంచి రష్యా సేనలు .ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి.
పుతిన్ నిర్ణయాన్ని ఊహించని అమెరికా సహ పశ్చిమ దేశాలు రష్యా తీరును తప్పుబడుతున్నాయి.రష్యా అధినేత కోట్లాది మంది జీవితాలను రిస్క్‌లో పెడుతున్నారని.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి.ఎలాగైనా పుతిన్ దూకుడును అడ్డుకోవాలనే లక్ష్యంతో వున్న అమెరికా సహా పాశ్చాత్య దేశాలు.
రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి.
ఈ క్రమంలో భారత్ మద్ధతును రష్యా, ఉక్రెయిన్, అమెరికాలు కోరుతున్నాయి.
దీంతో ఇండియా పరిస్ధితి అడకత్తెరలో పొకచెక్క మాదిరి తయారైంది.ఏ పక్షానికి సపోర్ట్ ఇచ్చినా.
మిగిలిన వారితో బంధం కట్ అవుతుంది.అంతేకాదు.
మూడు దేశాలతోనూ బలమైన ఆర్ధిక సంబంధాలు భారత్‌కు వున్నాయి.దీంతో మోడీ సర్కార్ ఏం చేయలేక సైలెంట్ అయ్యింది.
అయినప్పటికీ యుద్ధాన్ని ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నరేంద్ర మోడీ కోరారు.
ఇక అమెరికా విషయానికి వస్తే.
ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ మద్ధతు కోసం మంతనాలు జరుపుతున్నామని కానీ ఇంత వరకు ఎలాంటి ఫలితం లభించలేదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తున్నట్లు చెప్పారు.రష్యా దురాక్రమణ నేపథ్యంలో అమెరికాకు భారత్ పూర్తిగా సహకరిస్తుందా అన్న విలేకరుల ప్రశ్నకు బైడెన్ సమాధానమిస్తూ.
తాము దీనిపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.దీనిని బట్టి ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్- అమెరికాలు ఒకే మాటపై లేవని అర్ధమవుతోంది.
రష్యాతో భారతదేశానికి చారిత్రాత్మకమైన చెలిమి వుంది.అదే సమయంలో అమెరికాతో గడిచిన 15 ఏళ్ల నుంచి భారత్ దగ్గరవుతోంది.వైట్‌హౌస్, స్టేట్ డిపార్ట్‌మెంట్, జాతీయ భద్రతా మండలి వంటి వివిధ స్థాయిల్లో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత అత్యున్నత వర్గాలను సంప్రదించాయి.ఐరాస భద్రతా మండలిలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ వైఖరికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలను అమెరికా అధికారి దాటవేశారు.