సెంట్రల్ సీట్ అసోసియేషన్ బోర్డు (CSAB) భారతీయ సంతతికి చెందిన విద్యార్థులకు తీపి కబురందించింది.నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NITs)లతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్స్‌లో భారతీయ పౌరులకు ఉద్దేశించిన సీట్ల కోసం విదేశీ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (PIO) కార్డ్ హోల్డర్లను అనుమతించాలని CSAB నిర్ణయించింది.
CSAB ఛైర్మన్, NIT-R డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఉమామహేశ్వర్ రావు నేతృత్వంలోని CSAB కోర్ కమిటీ 2023, మే 9న ఈ నిర్ణయం తీసుకుంది.
ఓసీఐ, పీఐఓ కార్డ్ హోల్డర్లు భారతీయ పౌరులకు ఉద్దేశించిన సీట్ల కోసం పోటీ చేయడానికి అనుమతించాలనే నిర్ణయం 2023, ఫిబ్రవరిలో ఆమోదించిన సుప్రీం కోర్ట్ ఆర్డర్‌కు అనుగుణంగా ఉంది.సుప్రీం కోర్టు ఆర్డర్ అనేది నీట్ యూజీ 2023 కోసం ఓసీఐ, పీఐఓలను భారతీయ అభ్యర్థులతో సమానంగా ట్రీట్ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆదేశించింది.
CSAB కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తాజా నిర్ణయం తీసుకుంది.అయితే, ఓసీఐ పీఐఓ కార్డ్ హోల్డర్లు క్యాస్ట్ రిజర్వేషన్ లేదా హోమ్ స్టేట్ కోటాకు అర్హులు కాదు.వారు వైకల్యాలున్న వ్యక్తుల (PWDలు) కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాలకు మాత్రమే అర్హులు.ఓసీఐ పీఐఓ కార్డ్ హోల్డర్లు భారతీయ జాతీయులకు ఉద్దేశించిన సీట్ల కోసం పోటీ చేయడానికి అనుమతించే నిర్ణయం స్వాగతించదగిన చర్య అని చెప్పవచ్చు.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయ సంతతి విద్యార్థులకు భారతదేశంలో చదువుకోవడానికి ఇది మరిన్ని అవకాశాలను అందిస్తుంది.ఇది భారతదేశంలో చదువుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి అత్యుత్తమ, తెలివైన విద్యార్థులను ఆకర్షించడానికి కూడా సహాయపడుతుంది.