సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని వీడియోలు ఒక్కసారి చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి.అలాంటి వీడియో ఒకటి ఇపుడు గుండెను హత్తుకుంటోంది.
తల్లి క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోంది.ఆ పరిస్థితులతో ఉన్న తల్లికి కొడుకు ఆమెకి వెన్నుదన్నుగా నిలిచాడు.
ఆమె ముఖంలో ఆనందంకోసం అతను అతని స్నేహితులు కలిసి చేసిన పనిని నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.
విషయం ఏమంటే, సెలూన్లో బార్బర్‌గా పనిచేసే ఓ కుర్రాడు క్యాన్సర్ ట్రీట్మెంట్( Cancer Treatment ) తీసుకుంటున్న తల్లికి జుట్టు షేవ్ చేస్తుంటాడు.ఆ సమయంలో తల్లి చాలా ఎమోషనల్ అవుతుంది.కన్నీరు కారుస్తుంది.
తల్లి బాధని గమనించిన కొడుకు రేజర్‌తో తన జుట్టుని కూడా షేవ్ చేసుకుంటాడు.తరువాత అతనితో పనిచేసే స్నేహితులు కూడా వరుసగా తమ జుట్టుని షేవ్ చేసుకుని ఆ తల్లికి మద్దతుగా నిలవడం ఇపుడు పలువురిని ఆలోచింపజేస్తుంది.
క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమెకు మనోబలం చేకూర్చడానికి వారు చేసిన పని చూస్తే ఎవరికి మనసు కరగదు చెప్పండి.
గుడ్ న్యూస్ ఎంవీటి( MVT ) అనే ట్విట్టర్ యూజర్ ద్వారా ఈ వీడియో పోస్ట్ కాగా ప్రస్తుతం ఆ వీడియో జనాలకి తెగ నచ్చేస్తుంది.అవును, ఈ వీడియో ఇపుడు అందరి మనసుల్ని కదిలిస్తోంది.అవును, ఈ అందమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు వీరిని ఉద్దేశించి ‘అందమైన మనసులు’ అని ఒకరు కామెంట్ చేస్తే.
‘ఆ తల్లికి ప్రేమ అనే వైద్యాన్ని అందిస్తున్న వీరిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది’ అని మరికొందరు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వెల్లడించడం ఇక్కడ చూడవచ్చు.