బయట ఉన్నప్పుడు చాటింగ్ లో మునిగిపోకండి.. నాలా అయిపోతారు: నటి కామెంట్స్ వైరల్?

కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటి నికితా దత్త వాకింగ్ చేస్తుండగా ఆమెపై కొందరు దుండగులు దాడి చేసి సెల్ ఫోన్ ని లాక్కెళ్లిన విషయం తెలిసిందే.ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

 Nikita Dutta Says She Scared Step Out And Go Walk , Bollywood , Nikitha Dutt, Tv-TeluguStop.com

అయితే అప్పుడు పోయిన సెల్ ఫోన్ ఇప్పటివరకు తనకు దొరకలేదని తెలిపింది నికితా.ఆ ఘటన జరిగిన రోజు రాత్రి తాను అసలు నిద్రపోలేదని తెలిపింది.

అయితే తాజాగా ఈ విషయంపై ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది నికితా దత్త.

ఇంటర్వ్యూలో నికితా దత్తా మాట్లాడుతూ.‘ఆ రోజు జరిగిన ఘటన నిజంగా చాలా భయంకరం.నాకు నా ఫోన్‌ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోయింది.

ఆ ఘటనతో ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది.కానీ సాధారణ వాకింగ్‌ చేయడం అంటే నాకిష్టం.

కానీ నాకు అలా జరిగిన తరువాత ధైర్యం చేసి వెళ్లలేక పోతున్నాను.నేను ఇప్పట్లో బయటకు వెళ్లలేను.

అలా వెళ్ళాలి అనీ కూడా నాకు అనిపించడం లేదు అనీ చెప్పుకొచ్చింది.

అలాగే నా లైఫ్ లో జరిగిన ఈ భయంకర సంఘటనను పీడకలగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.

మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను.రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరితో చాటింగ్ చేయవద్దు, మెసేజ్ చేస్తూ ఫోన్ లో మునిగిపోవద్దు ఎందుకు అంటే నాకు జరిగిన సంఘటన మీకు కూడా జరగవచ్చు అంటూ సలహా ఇచ్చింది నికిత దత్త.నికితా దత్తా డైబుక్‌, ఏక్‌డుజ్‌కే వాస్తే, ది బిగ్‌బుల్‌, కబీర్‌ సింగ్‌ లాంటి సినిమా లలో నటించింది.2012 లో జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా ఫైనల్‌ వరకూ చేరింది ఈ బ్యూటీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube