అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని ( New York )ప్రఖ్యాత టైమ్స్ స్కేర్‌లో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.వీరిలో కొందరు వలసదారులు కూడా వున్నట్లు మీడియా నివేదించింది.
మరో 16 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.న్యూయార్క్ పోలీస్ శాఖ ప్రకారం నికరాగ్వాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని గురువారం సాయంత్రం ముసుగులు ధరించిన దుండగులు గుంపు వెనుక భాగంలో కత్తితో పొడించింది.
బాధితుడు తన స్నేహితులతో కలిసి ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్‌కు వెళ్లాడు.ఈ క్రమంలో ఎనిమిదో అవెన్యూ సమీపంలోని వెస్ట్ 42వ వీధిలో సాయంత్రం 5.30 గంటలకు ఈ దాడి జరిగింది.భయాందోళనలకు గురైన బాలుడు తొలుత వారిని వెంబడించగా.
వారిలో ఒకరు అతనిని వీపు కింది భాగంలో కత్తితో పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు.
బెల్ మొహమ్మద్( Bel Mohammed ) అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.ఎవరో పరిగెత్తడం తాను చూశానని, అతని వెనుక నుంచి రక్తం వస్తోందని చెప్పాడు.దాడి చేసిన వారి నుంచి రక్షించుకోవడానికి అతను ప్రయత్నించినప్పటికీ, స్పృహ కోల్పోయాడని ఆయన వెల్లడించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఈఎంఎస్ ద్వారా బెల్లేవ్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి క్వీన్స్‌కు చెందిన మైఖేల్ కొలోమ్( Michael Colomb ) (22)పై ముఠా దాడి, నేరపూరిత ఆయుధాన్ని కలిగివున్నట్లుగా అభియోగాలు మోపారు.
మైనర్‌లు కావడంతో 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు, 14 ఏళ్ల బాలుడిపైనా సామూహిక దాడి అభియోగాలు నమోదు చేశారు.మరో యువ నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ తర్వాత విడుదల చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ అయిన టీనేజర్లలో ఇద్దరు వెనిజులా నుంచి అమెరికాకు వలస వచ్చినవారేనని వారు తెలిపారు.
కాగా.అక్రమ వలసదారుల కారణంగా అమెరికాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.వీరు రోడ్డు పక్కన , ఫుట్‌పాత్‌లపై గుడారాలు వేసుకుని నివసిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల న్యూయార్క్ టైమ్స్ స్కేర్‌లో ఏకంగా పోలీస్ అధికారులపై వలసదారుల గుంపు దాడికి తెగబడటం కలకలం రేపింది.ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా సంఘటన నేపథ్యంలో స్థానికులు, పర్యాటకులు ఉలిక్కిపడ్డారు.